సింగరాయకొండ, శ్రీ చెట్టు మహాలక్షమ్మ దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు...

Aug 21, 2026 - 07:17
Aug 23, 2026 - 16:05
 0  59

శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు ప్రకాశం జిల్లా, సింగరాయకొండ: కళ్యాణ మండపం బజారులో కొలువుదీరిన శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించగా, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవమూర్తికి కంకణాభిషేకం నిర్వహించి, పూలు, బంగారం, వెండి, పట్టు వస్త్రాలు, నగదు తదితర కానుకలను భక్తులు సమర్పించారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం, మల్లెపూలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శుభాలు కలగాలని ప్రార్థించారు.

What's Your Reaction?

Like Like 3
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0