రామాలయంలో ఘనంగా లక్ష్మీ కుబేర పూజ
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ కోదండ రామ దేవస్థానంలో పోలాల అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ కుబేర పూజ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9:30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కుబేర స్వామి 108 నామావళి, లక్ష్మీదేవి 108 నామావళి పఠిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ కుబేర హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు కుబేర స్వామి డాలర్లు అందజేశారు. లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. పోలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ శ్రీ లక్ష్మీ కుబేర పూజ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0