చెకుముకిలో శ్రీ విద్యానికేతన్ సత్తా! జిల్లా స్థాయికి ముగ్గురు విద్యార్థుల ఎంపిక

Sep 11, 2026 - 13:58
 0  3

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో జిల్లా స్థాయికి శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు మూలగుంటపాడులోని శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన 10వ తరగతి విభాగంలో షేక్ గౌసియా సుహనా, 9వ తరగతి విభాగంలో కె. సాత్విక, 8వ తరగతి విభాగంలో కె. రిత్విక భరద్వాజ్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు కోటపాటి నారాయణ, విజయానంద్ తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు అభినందించారు. తమ విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. హరిబాబు గారు విద్యార్థులకు సందేశమిస్తూ, చెకుముకి టాలెంట్ టెస్ట్ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, తార్కిక ఆలోచనను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే గొప్ప వేదిక అని అన్నారు. పాఠ్యపుస్తకాల్లోని విషయాలను కేవలం చదవడమే కాకుండా, వాటిని నిత్యజీవితంలో అన్వయించుకోవడం ద్వారా విజ్ఞానం మరింత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పోటీని కేవలం గెలుపు, ఓటమిగా భావించకుండా తమ ప్రతిభను తెలుసుకునే అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఆసక్తితో ప్రశ్నలు అడగడం, ప్రయోగాలు చేయడం, కొత్త విషయాలను తెలుసుకోవడం అలవర్చుకోవాలని చెప్పారు. చెకుముకి వంటి టాలెంట్ టెస్ట్‌లలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెరుగుతాయని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి చదివి, జిల్లా స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ బి. హరిబాబు ఆకాంక్షించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0