సింగరాయకొండ తహశీల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న మెడికల్ అసోసియేషన్ సభ్యులు
మందుల ఆన్లైన్ వ్యాపారాలను నిరసిస్తు..

సింగరాయకొండలో మెడికల్ షాపుల బంద్ ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్‌లో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో మందుల దుకాణాల యజమానులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ ఫార్మసీల అమ్మకాలను వ్యతిరేకిస్తూ స్థానిక ఔషధ దుకాణాలను మూసివేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు సింగరాయకొండ తహసీల్దార్ NB రాజేష్ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆన్లైన్ ఔషధ విక్రయాల వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా మందుల నాణ్యతలో లోపాలు, నకిలీ మందుల విక్రయాలు, సరైన వైద్య సూచనలు లేకుండా మందులు అందుబాటులోకి రావడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ సమస్యలను అర్థం చేసుకొని ఆన్లైన్ ద్వారా మందులు కొనుగోలు చేయకుండా, స్థానిక ఫార్మసీల నుంచే మందులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ఔషధ దుకాణాల సంఘం అధ్యక్షుడు పొత్తూరు మురళీకృష్ణ, కొలపర్తి శీను, శేషారావు, మట్టా సుబ్బారావు తదితర మందుల షాపుల యజమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0