పాకల బీచ్ లో అడిషనల్ యస్. పి పర్యటన...పలు సూచనలు

Sep 11, 2026 - 10:24
Sep 11, 2026 - 10:26
 0  5
1 / 1

వినాయక చవితి ఏర్పాట్లపై అడిషనల్ ఎస్పీ తనిఖీలు సింగరాయకొండ మండలం – పాకల బీచ్ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద చేపడుతున్న ఏర్పాట్లను ఒంగోలు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎన్. యుగంధర్ బాబు శుక్రవారం పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు, లైటింగ్, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం అక్కడి మత్స్యకారులతో మాట్లాడి.. ఏయే రోజుల్లో ఎన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని, సముద్రంలో అలల తీవ్రత ఎలా ఉంటుందనే విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ సీఐ, ఎస్సైలకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0