శనివారం 1008 బిందెలతో సీతారాముల మూలవిరాట్టుకు మహా జలాభిషేకం

Jul 25, 2026 - 04:36
 0  71

సింగరాయకొండ, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా సింగరాయకొండ కోదండ రామాలయం బజారులోని శ్రీ సీతారాముల మూలవిరాట్టుకు శనివారం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య 1008 బిందెలతో మహా జలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ సీతారాముల వారి అనుగ్రహం కలగాలని వేద పండితులు ప్రార్థించారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1