సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షేక్ అల్లా భక్షు ఎన్నికల ప్రచారం..

Oct 25, 2026 - 14:17
 0  1

సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షేక్ అల్లా భక్షు ఎన్నికల ప్రచారం సింగరాయకొండ, అక్టోబర్ 25: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆశీస్సులతో, వైఎస్సార్‌సీపీ బలపరిచిన సింగరాయకొండ ఎంపీటీసీ-4 అభ్యర్థి షేక్ అల్లా భక్షు ఆదివారం సింగరాయకొండ మండల పరిధిలోని ప్రశాంతి హాల్, ఇస్లాంపేట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికులను కలుసుకుని ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0