అక్టోబర్ 9న సీఎం నర్సింగోలు పర్యటన ...స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు

Oct 6, 2026 - 13:46
Oct 6, 2026 - 13:46
 0  2
హెలిపాడ్, ప్రజా వేదిక ను పరిశీలిస్తున్న అధికారులు
1 / 1

హెలిపాడ్, ప్రజా వేదిక ను పరిశీలిస్తున్న అధికారులు

ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో, జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ఏర్పాటుచ్యఈయనున్న హెలిపాడ్, ప్రజా వేదిక మరియు పార్టీ క్యాడర్ మీటింగ్ నిర్వహణ కోసం స్థలాన్ని అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు గారు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారు, తదితర అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ భద్రత, ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలపై చర్చించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0