పాత సింగరాయకొండలో వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం

Sep 26, 2026 - 05:01
Sep 26, 2026 - 05:05
 0  120

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా శ్రీ గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సింగరాయకొండ, మూలగుంటపాడు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని *తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని *ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు (నాయుడు)* ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి రంగరాజు, ఆలయ సిబ్బంది, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0