పాత సింగరాయకొండ లో వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు..

Oct 26, 2026 - 05:56
 0  85

పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో వైభవంగా గిరి ప్రదక్షిణ.. ప్రకాశం జిల్లా, పాత సింగరాయకొండలోని ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామివారిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. ఆలయ పరిసరాలు భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముందుగా ..ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు సన్నెబొయిన శ్రీనివాస నాయుడు కార్యనిర్వాహణాధికారి వి రంగరాజు కొబ్బరికాయ కొట్టి స్వామిని మనసారా వేడుకొని అంతా శుభం కలగాలని సకాలంలో వర్షాలు పడి అందరూ బాగుండాలని కోరుకున్నారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0