బాపట్ల జిల్లా నుండి తిరుమలకు పాద యాత్రగా బయలుదేరిన బీసీవై పార్టీ నాయకులకు స్వాగతం పలికిన సింగరాయకొండ అభిమానులు..

Aug 19, 2026 - 12:59
Aug 19, 2026 - 13:00
 0  12

బాపట్ల నుంచి తిరుమలకు పాదయాత్ర బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన డొక్కు కనక చింతయ్య యాదవ్, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బాపట్ల నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా సింగరాయకొండ బైపాస్ వద్ద బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సింగరాయకొండ అయ్యప్ప నగర్‌లో పాదయాత్ర బృందానికి నాయకులు స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మైనార్టీ జిల్లా అధ్యక్షులు నజీర్ భాష, బీసీవై పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి సత్యనారాయణ యాదవ్, పాత సింగరాయకొండ బీసీవై పార్టీ అధ్యక్షులు నక్క యానాది యాదవ్, రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ కావేటి కృష్ణ, బీసీవై పార్టీ నాయకులు పి. సురేష్, బి. సురేష్, బి. వంశీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0