దశరా శెలవులకు వెళుతూ సింగరాయకొండ వద్ద ప్రమాదం..
దశరా శెలవులకు వెళుతూ సింగరాయకొండ వద్ద ప్రమాదం.. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే పై పోలేరమ్మ గుడి సమీపంలో కావలి నుండి రాజమండ్రి వెళ్తున్న నంబర్ కల AP40LS8055 కారు ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ కంట్రోల్ తప్పి ఎడమ పక్కన ఉన్న జామాయిల్ తోటలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు, హైవే పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటికి తీసి, హైవే అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు భార్యాభర్తలు ఓబుల్ రెడ్డి, రాజేశ్వరి గా గుర్తించారు. వీరు కడప నుండి దసరా సెలవుల నిమిత్తం సొంత ఊరు రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0