సింగరాయకొండ ఎస్సైగా లేళ్ల సుధీర్ కుమార్

May 15, 2026 - 04:41
 0  4

సింగరాయకొండ ఎస్సైగా లేళ్ల సుధీర్ కుమార్ బాధ్యతల స్వీకారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా లేళ్ల సుధీర్ కుమార్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు రహదారులపై అంతరాయం కలిగించవద్దని సూచించారు. అలాగే ప్రాంతంలో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచుతామని తెలిపారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్సై తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0