దేవి శ్రీ ఫుడ్స్ లిమిటెడ్ లోని కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు
సింగరాయకొండలోని దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కోసం శంకర నేత్రాలయ, పెదకాకాని, గుంటూరు వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ వైద్య సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంటి సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దేవి సీ ఫుడ్స్ యాజమాన్య ప్రతినిధులు, శంకర నేత్రాలయ వైద్య సిబ్బంది, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0