ఊళ్లపాలెంలో విష్ణు దుర్గ అవతారంలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు..
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు విష్ణు దుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా తమ కుటుంబాలను, గ్రామాన్ని అమ్మవారు కాపాడాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో సందడిగా మారింది.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0