సింగరాయకొండ లో ఘనంగా పంచామృతాభిషేకం
సింగరాయకొండలో ఘనంగా పంచామృత అభిషేకం
సింగరాయకొండ, అక్టోబర్ 04: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ రైల్వే రోడ్డులో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో ఆదివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకం జరిగింది. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు భక్తులకు తీర్థప్రసాదములు అందజేసి ఆశీర్వదించారు.
What's Your Reaction?
Like
3
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0