🛣️ శానంపూడి రహదారి మరమ్మత్తులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడండి
🚨 రోడ్డు కాదు... ప్రమాదాల బాట! శానంపూడి ప్రజల ఆవేదన

శానంపూడి గ్రామ రహదారిని వెంటనే నిర్మించాలి - రావినూతల కోటి మాదిగ ప్రకాశం జిల్లా, జూలై 10: ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం శానంపూడి గ్రామ రహదారి అధ్వాన స్థితిపై MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ, శానంపూడి గ్రామ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గుంతలతో నిండిపోయిన రహదారిపై ప్రయాణించడం ప్రాణాంతకంగా మారిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోజు కూలీలు ఉపాధికి వెళ్లేందుకు, గర్భిణులు ఆసుపత్రులకు చేరుకునేందుకు, వికలాంగులు, వృద్ధులు, విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిధులు మంజూరు చేసి శానంపూడి గ్రామ రహదారిని శాశ్వతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు , రావినూతల శ్రీను, రావినూతల అంకయ్య , కోడిపల్లి బాబు, తగరం రాము, బుర్లా చంద్రశేఖర్,పున్నేపల్లి నారాయణ, గురజాల తిరుపాలు, వినోద్,నారాయణ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0