గీతం ఒలంపియాడ్ స్కూల్ లో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన

Jul 28, 2026 - 12:59
 0  1

విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన.. సింగరాయకొండ: గీతం ఒలంపియాడ్ స్కూల్‌లో విద్యార్థులకు ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సాధారణ ఎన్నికల తరహాలో పాఠశాల ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అసిస్టెంట్ హెడ్ బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్‌తో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివిధ విభాగాల ప్రతినిధులను విద్యార్థుల ఓటింగ్ ద్వారా ఎన్నుకునే ప్రక్రియను చేపట్టారు. ఈ ఎన్నికల ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు విలువ, ఎన్నికల నిర్వహణ విధానం, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటి అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. అందులో భాగంగానే పాఠశాలలో ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని పరిచయం చేస్తూ ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0