ప్రభుత్వ పాఠశాలకు 100 నోటు పుస్తకాల పంపిణీ
విద్యార్థులకు చేయూత.. ప్రభుత్వ పాఠశాలకు స్టేషనరీ అందజేత
సింగరాయకొండ, జూన్ 27: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సింగరాయకొండ మండలంలోని ఎంపీపీ పాఠశాల, బాలయోగి నగర్‌లో విద్యార్థులకు 100 నోటు పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాత సుబ్బారెడ్డి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల అభివృద్ధి అధికారి జయమణి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సమాజం నుంచి లభిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
అతిథిగా పాల్గొన్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ దాసరి పావని మాట్లాడుతూ, విద్యతో పాటు ఆరోగ్యంపైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పరిశుభ్రత, పోషకాహారం, క్రమమైన వ్యాయామం అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొల్లూరి వెంకయ్య, ఉపాధ్యాయులు చిడితోటి నరేంద్ర, మారుతీదేవి, హిమబిందు, న్యాయవాది పఠాన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0