వికసిత్ భారత్ – జి రామ్ జి పథకం ప్రారంభం వావిలేటిపాడులో మంత్రి డోలా బీవీ స్వామి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి ప్రారంభం
కొండపి నియోజకవర్గంలో ఘనంగా వికసిత్ భారత్ – జి రామ్ జి పథకం ప్రారంభం
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మంత్రి, జిల్లా కలెక్టర్ పరిశీలించి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌డీఓ శ్రీ చంద్రశేఖర్ నాయుడు, డ్వామా పీడీ శ్రీ జోసెఫ్ కుమార్, ఏపీడీ శ్రీ రవికుమార్, హౌసింగ్ పీడీ శ్రీ మారుతి ప్రసాద్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, వేజ్ సీకర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0