శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు సవిత, డోలా బీవీ స్వామి

Jul 13, 2026 - 13:11
 0  8

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించిన మంత్రులు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0