గాంధీజీ మార్గంలోనే కూటమి పాలన...ఆర్య వైశ్య నాయకులు కొత్తూరు శ్రీ రంగనాయకులు
సత్యం, అహింస, శాంతి ప్రతీ ఒక్కరి జీవిత మార్గం కావాలి
సింగరాయకొండలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా, సింగరాయకొండ: మండలంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, మానవత్వం వంటి గొప్ప ఆశయాలను ప్రజలకు వివరించారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో జీవిస్తూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు శ్రీ రంగనాయకులు, గొల్ల కిరణ్, మునగ సుబ్బారావు, మునగనూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0