మురసు తుఫాన్‌తో సింగరాయకొండలో నిలిచిన రైలు.. ప్రయాణికులకు అల్పాహారం అందించిన ఆర్యవైశ్య సంఘాలు ...
# తుఫాను వేళ ఆపన్నహస్తం.. రైలు ప్రయాణికులకు ఆర్యవైశ్య సంఘాల భోజన వసతి **సింగరాయకొండ:** మురుసు తుఫాను ప్రభావంతో రైలు ప్రయాణం మధ్యలో నిలిచిపోయిన ప్రయాణికులకు సింగరాయకొండలో స్థానిక ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు. తుఫాను కారణంగా రైల్వే అధికారులు వైజాగ్ వెళ్లే రైలును సోమవారం రాత్రి నుంచి సింగరాయకొండ అమృత్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల అవస్థలను గమనించిన స్థానిక ఆర్యవైశ్య సామాజిక కార్యకర్తలు మానవతా దృక్పథంతో స్పందించారు. ప్రయాణికులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమే కాకుండా, స్వయంగా వారి వద్దకు వెళ్లి భోజనాన్ని అందజేశారు. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం మధ్యలో నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో భోజన సదుపాయం కల్పించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి ప్రయాణికులకు సేవలందించిన సామాజిక కార్యకర్తలను పలువురు అభినందించారు. **తుఫాను సమయంలో ప్రయాణికులకు అందించిన ఈ సేవలు మానవత్వానికి నిదర్శనంగా నిలిచాయి.**
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0