శ్రీ కోదండ రామాలయంలో మహా మృత్యుంజయ హోమం రుద్రాభిషేకం

Nov 10, 2026 - 12:50
 0  14

*సింగరాయకొండ* శ్రీ కోదండ రామాలయంలో మహా రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం

 ప్రకాశం జిల్లా, సింగరాయకొండ రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివునికి మహా రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శివలింగానికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ హోమం, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా చేశారు. కార్తీక మాసంలో శివునికి చేసే రుద్రాభిషేకం, హోమం వల్ల ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0