మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమం
మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, ఫాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ ఒంగోలు: రూడ్‌సెట్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు 30 రోజుల పాటు మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, ఫాబ్రిక్ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 17-11-2026 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు అర్హులని, అభ్యర్థుల వయస్సు 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలను కూడా సంస్థ ఉచితంగా కల్పిస్తుందని వెల్లడించారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9573363141
ఇట్లు, డైరెక్టర్ రూడ్‌సెట్ సంస్థ, ఒంగోలు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0