ప్రకాశం జిల్లా త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వరుడి ఆలయంలో కోటి దీపోత్సవం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద కుమారగిరి పై వెలసిన ఉన్న పురాతన శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరుడి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం,సహస్ర జ్యోతి లింగార్చన, సోపాన దీపోత్సవం కార్యక్రమాలను అర్చకులు, అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన కోటి దీపోత్సవం లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0