నిధులు, హక్కులు లేని విబి -జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలి

Jan 13, 2026 - 03:13
Jan 13, 2026 - 03:18
 0  10
అఖిలభారత రైతు కూలీ సంఘం (aikms)డిమాండ్
1 / 2

1. అఖిలభారత రైతు కూలీ సంఘం (aikms)డిమాండ్

గ్రామీణ పేదల ఉపాధి హామీ హక్కును రద్దుచేసిననిధులు, హక్కులు లేని వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవ్ కమిషన్ ( వి బి -జి రామ్ జి) పథకాన్ని రద్దు చేయాలని గ్రామీణ పేదలకు ఉపాధి హక్కుకల్పించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) కొనసాగించాలని అఖిల భారత రైతు కూలి సంఘం (aikms )రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కే,'నాంచార్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు అఖిలభారత రైతు-కూలీ సంఘం(aikms) ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది.ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి కామ్రేడ్ కే,నాంచార్లు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి ఉపాధి హక్కును  కాలరాస్తూ కేంద్రంలోని ఫాసిస్టు మోడీ ప్రభుత్వం 2025 డిసెంబరు 16వ తేదీన భారత పార్లమెంటులో "వికసిత్  భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వి బి -జి రాంజీ)" బిల్లు ఆమోదించిందని, డిసెంబర్ 18 తేదీన నాటికి చట్టంగా చేస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిందని, వి బి జీ రాంజీ పథకంలొ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపాధి హక్కు ను రద్దు చేసి రాష్ట్రాల పై భారం. మోపిందని అందువలన ఆంధ్రప్రదేశ్ కు సంవత్సరానికి5000కోట్లు రూపాయలు నిధులు ఆగిపోతాయని, వి బి జి రాంజీ పథకంలో 125 రోజులు పని కల్పిస్తామనటం బూటకమని,నిధులు లేకుండా ఎలా పనులు కల్పిస్తారాని విమర్శించారు,  పేద గ్రామీణ ప్రజలకి కాదు ఉపాధి హామీ పథకం అమలు చేసే ఉద్యోగస్తులు కూడా ఉపాధి కోల్పోతారని అందువలన జిరాంజీ పథకం రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం మండల నాయకులు కృష్ణయ్య, ముద్రగడ వెంకటేశ్వర్లు ఆవుల యానాదమ్మ, దాసరి అంజియ్య, ముద్రగడ కొండమ్మ, తదితరులు పాల్గొన్నారు, అనంతరం ఎండిఓ కార్యాలయంలోని సూపరిండెంట్ కు మెమరాండం సమర్పించారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0