గొర్రెపాటి రామయ్య చౌదరి , అరతోటి ఝాన్సీ రాణి చేతుల మీదగా టీకాల కార్యక్రమం ప్రారంభం...
పెట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాలు నిండిన, 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్‌పీవీ (HPV - హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య చౌదరి మరియు పెట్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆరెతోటి ఝాన్సీరాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌పీవీ టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు. చిన్న వయస్సులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొర్రపాటి వీరభోగ వసంత రాయుడు, పెట్లూరు గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు కందిమళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అలాగే పెట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పి. అనూష, డాక్టర్ ఐ. ప్రియాంకతో పాటు వైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0