పారిశుద్ధ్య కార్మికులకు కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Jul 1, 2026 - 07:27
 0  9

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎంపీడీవో కార్యాలయంలో కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో జయమణి ముఖ్య అతిథులుగా హాజరై, వారి చేతుల మీదుగా 100 మంది కార్మిక కుటుంబాలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ, గ్రామాన్ని దేవాలయంగా భావించి ప్రజలకు నిరంతరం సేవలందించే పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి సహాయం చేయడం కిలాడి ఫౌండేషన్ సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. అదే కార్యక్రమంలో నడవలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగ మహిళకు కిలాడి ఫౌండేషన్ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు, కార్మికులు అభినందిస్తూ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0