21 వ అంతర్జాతీయ యోగా వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి.. ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల యోగ గురువులు పాల్గొని ఆసనాలు చేశారు
కొండపి ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా యోగా ఆంధ్ర వేడుకలు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ఆంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రదర్శనలు నిర్వహించి, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రామాంజనేయులు, తహసీల్దార్ సేలం శ్రీనివాసరావు, ఏపీఎం గోపీనాథ్, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ విక్టోరియా రాణి పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీ సిబ్బంది, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
What's Your Reaction?
Like
3
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0