ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి డాక్టర్ బి హరిబాబు..
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి... డాక్టర్ బి హరిబాబు. పదవ తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ - శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించగ,కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డా. బి. హరిబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. బి. హరిబాబు గారు మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా పరీక్షలకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా హాల్ టికెట్, బ్లూ మరియు బ్లాక్ పెన్నులు, పెన్సిల్స్, లాంగ్ స్కేల్ వంటి వస్తువులు తమతో తీసుకువెళ్లాలని చెప్పారు. అలాగే పరీక్షలకు భయం లేకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి చదువుతున్న మొత్తం 54 మంది విద్యార్థుల పరీక్షకు సంబంధించిన విద్యాసామాగ్రి అందించారు. అదేవిధంగా క్రమశిక్షణతో చదువుకుని మంచి మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు కోటపాటి నారాయణ గారు కూడా విద్యార్థులకు పరీక్షల్లో ఎలా రాయాలి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, మంచి మార్కులు సాధించడానికి పాటించాల్సిన మెలకువలు వివరించారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మాటలు వినుతూ మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తరరావు గారు, యాకోబు గారు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0