చలివేంద్రాలు ఏర్పాటు కు ప్రజలు ముందుకు రావాలి...సిఐ హజరత్తయ్య
ప్రకాశం: సింగరాయకొండ cvr హాస్పిటల్ ఎదురుగా GSK సంస్థల అధినేత గంజి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఉగాది పర్వదిన సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య, AP గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ హజరత్తయ్య మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి విరివిగా చలివేంద్రం ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాక శ్రీను, మేకల అంకారావు మేకల మల్లికార్జున రావు మేకల నరేష్ బకమంతుల సుబ్బారావు చల్లా శ్రీను చెమట మాధవ జమ్మూ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0