అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి."
కలికివాయలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
రైతు ముఖంలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామంలో నిర్వహించిన 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలో మొదటి విడతగా 1,87,208 రైతు కుటుంబాల ఖాతాలలో మొత్తం రూ.125.65 కోట్ల రూపాయలు జమ అయ్యాయన్నారు.ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి వేదిక నుంచి బటన్ నొక్కి నిధులను విడుదల చేసిన తరుణంలో, కలికివాయ గ్రామంలో స్థానిక రైతులతో కలిసి మంత్రి ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. రైతులకు పథకం ద్వారా అందిన సాయం తాలూకూ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు పెట్టుబడి కష్టాలు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 (రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5,000 + పీఎం కిసాన్ వాటా రూ.2,000) జమ చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేసేవిధంగా సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క అర్హుడైన రైతు కూడా నష్టపోకూడదని, ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పనిచేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయడంలో మా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచింది. ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన విధంగానే, నేడు మొదటి విడత కింద నిధులను విడుదల చేశామన్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రతి రైతుకూ సాగు నీరు, నాణ్యమైన ఎరువులు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు.ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న ప్రభుత్వం మనదేనని ఆయన తెలిపారు.దీపం 2.0 కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లుల ఖాతాలలో 13 వేల రూపాయలు చొప్పున నగదు జమజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఇది ఒక చరిత్ర అని మంత్రి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని కానీ మన ప్రభుత్వంలో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇవ్వడానికి, రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.భూ సమస్యలను పరిష్కరించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ ఉపసంఘం క్రమం తప్పకుండా భేటీ అవుతూ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఉన్నట్లు చెప్పారు.మన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ, అబివృద్ధి పథకాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందనీ మంత్రి తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ నిధులు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయన్నారు.ఈ నగదు పెట్టుబడికి రైతులకు బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ గ్రామంలో రీ సర్వే లో సమస్యలున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ గ్రామం మొత్తం మళ్ళీ రీ సర్వే చేపించి ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. కలికివాయ రైతులలో హర్షాతిరేకాలు ప్రభుత్వం అందించిన ఈ సకాలపు సాయం పట్ల కలికివాయ మరియు సింగరాయకొండ మండల రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0