సూపర్ సిక్స్ పధకం కింద ప్రకటించిన పధకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు
శుక్రవారం ఉదయం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ప్రకాశం జిల్లా, కొండపి నియోజక వర్గం పొన్నలూరు మండలం, చెరుకూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల మ్యానిఫెస్టులో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి నెలా ఖచ్చితంగా పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు 3వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని 4వేల రూపాయలకు పెంచడంతో పాటు విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పధకం కింద ప్రకటించిన పధకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఎన్నికల హామీలో బాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీపం - 2 పథకం క్రింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20 వేల రూపాయలను అందిస్తున్నామన్నారు. ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అబివృద్ధి,సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వం ద్వేయమన్నారుఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమ వంశి, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0