సింగరాయకొండ లో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ నెల 12వ తేదీ మంగళవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కలిసి హనుమాన్ చాలీసాను 41 సార్లు పారాయణం చేశారు. తదుపరి ఆకుపూజ, హోమం కార్యక్రమాలు నిర్వహించగా, ఆంజనేయ స్వామికి లక్ష అప్పాలతో సహస్రనామావళి కార్యక్రమం భక్తిపూర్వకంగా జరిగింది.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0