సింగరాయకొండలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం..
సింగరాయకొండలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం రూ.1.75 లక్షల వివాదానికి రాజీ పరిష్కారం.. రాజీ మార్గమే శాశ్వత పరిష్కారమని జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి సూచన సింగరాయకొండ, జూలై 11 (KVS NEWS): సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరస్పర రాజీ ద్వారా వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్ అదాలత్ ప్రజలకు సులభమైన, వేగవంతమైన మరియు శాశ్వత న్యాయ పరిష్కారాన్ని అందించే ప్రజాహిత వేదిక అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా లోక్ అదాలత్ విజయవంతం కావడానికి బార్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రామిసరీ నోటు ఆధారంగా దాఖలైన ఒక సివిల్ కేసుకు సంబంధించిన ఎగ్జిక్యూషన్ పిటిషన్‌లో, కోర్టు సమక్షంలో డిఫెండెంట్ రూ.1,75,000 నగదును 75 ఏళ్ల వయోవృద్ధుడైన డిక్రీ హోల్డర్‌కు చెల్లించారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం అందించిన మరో ఉదాహరణగా ఇది నిలిచింది. లోక్ అదాలత్ ప్యానల్ న్యాయవాదులుగా బి. వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర సేవలందించారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సుధాకర్ నాయుడు, న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు, వంశీ, రియాజ్, కోదండపాణి, సురేష్, నాగరాజు, శ్రీనివాసులు, అశోక్, శ్రీలక్ష్మి, వాసంతి, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. అనంతరం కోర్టుకు హాజరైన కక్షిదారులకు మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0