సింగరాయకొండ లో డాబాలు మామిడికాయల దుకాణాల యజమానులతో పోలీసుల సమావేశం
సింగరాయకొండలో డాబాలు, హోటల్ యజమానులతో పోలీసుల సమావేశం సింగరాయకొండ, మే 13: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ V హర్ష వర్ధన్ IPS గారి సూచనల మేరకు, ఓంగోలు డీఎస్పీ ఆదేశాలపై సింగరాయకొండ సిఐ శ్రీ Y శ్రీహరి గారు బుధవారం సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని నేషనల్ హైవేపై ఉన్న డాబాలు, హోటళ్లు మరియు మామిడికాయల షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాల అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై చర్చించారు. ప్రతి రోజు రాత్రి 11 గంటలలోపు అన్ని షాపులు తప్పనిసరిగా మూసివేయాలని, ఆ తర్వాత కూడా షాపులు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అలాగే ప్రతి షాపు వద్ద వాచ్‌మెన్‌ను నియమించుకోవాలని, వాహనాలు రోడ్డుపై నిలపకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాల్లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఏదైనా షాపు ఎదుట యజమాని నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ షాపు యజమానిని కూడా బాధ్యుడిగా పరిగణిస్తామని సిఐ గారు స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు, హైవే పోలీసులకు పూర్తి సహకారం అందించాలని షాపు యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాచర్ల గారు, సింగరాయకొండ ఏఎస్సై శేషారెడ్డి గారు మరియు హైవే మొబైల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
1
Angry
0
Sad
0
Wow
0