ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సింగరాయకొండ లో వైసిపి నాయకుల ఆందోళన తహసీల్దారికి వినతి పత్రం
ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన కొండేపి నియోజకవర్గం / సింగరాయకొండ మండలం, మే 18: ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. సింగరాయకొండ చేపల మార్కెట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎడ్లబండిపై సాగింది. “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి”, “పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను నిరసించారు. మండల అధ్యక్షులు ఎడ్లబండిపై ఎక్కి నిరసన వ్యక్తం చేయగా, కార్యకర్తలు ఎడ్లబండిని లాగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాలీ భారీగా సాగి MRO కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం అధికారులు కు వినతిపత్రం సమర్పించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, టౌన్, గ్రామ స్థాయి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0