సింగరాయకొండ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు
సింగరాయకొండలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం సింగరాయకొండలోని దాచూరి రామిరెడ్డి – అనసూర్యమ్మ ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ బి. హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బి. హరిబాబు మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య నిరాడంబర జీవనం గడిపిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. రైతులు, కార్మికులు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా ఆయన నిలిచారని తెలిపారు. సుందరయ్య సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని, నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే ధైర్యసాహసాలు సుందరయ్య జీవితంలో ప్రతిఫలించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులు అర్పించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0