కామేపల్లి పోలేరమ్మ అమ్మవారి ఆలయం దర్శనానికి పోటెత్తిన భక్తులు..
కామేపల్లి పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, పొంగళ్ళు పెట్టుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బైరాగి చౌదరి, కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, కామేపల్లిలో వెలసిన పోలేరమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. చిన్న కనకదుర్గమ్మగా భావిస్తూ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0