శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.90 వేల విలువైన ఏసీ విరాళం
నెల్లూరు దంపతుల సేవాభావానికి ఆలయ నిర్వాహకుల అభినందనలు
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.90 వేల విలువైన ఏసీ విరాళం
సింగరాయకొండ, జూన్ 19:
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన అసోది దినకర్ రెడ్డి తన ధర్మపత్ని జయ మాధవితో కలిసి రూ.90,000 విలువైన ఎయిర్ కండీషనర్ (ఏసీ)ను శుక్రవారం విరాళంగా అందజేశారు.
దేవస్థానం చైర్మన్ సన్నిపోయిన శ్రీనివాసులు నాయుడు, కార్యనిర్వాహణాధికారి కృష్ణవేణి సమక్షంలో ఈ ఏసీని ఆలయానికి అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ సన్నిపోయిన శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి భక్తులు ఇదే విధంగా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నరసింహాచార్యులు, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0