చింతలపాలెంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన మంత్రి డోలా బీవీ స్వామి
స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్రలో మంత్రి డోలా బీవీ స్వామి పాల్గొన్నారు
చింతలపాలెంలో ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ – పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత
ప్రకాశం జిల్లా, జరుగుమల్లి:
జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు.
మంత్రి మాట్లాడుతూ, "మన ఇల్లు – మన వీధి – మన గ్రామం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
అదేవిధంగా, P4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
Tags:
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0