సింగరాయకొండ మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం..

Oct 28, 2026 - 10:19
 0  6
సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్
1 / 1

సింగరాయకొండలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్

సింగరాయకొండ, అక్టోబర్ 28:

సింగరాయకొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అనంతరం మూలగుంటపాడు ఎంపీటీసీ సెగ్మెంట్–2 పరిధిలో సింగరాయకొండ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0