నిన్న సోషల్ మీడియా గెలిచింది..మరో సారి కళ్ళ ముందు రుజువైంది
నిన్న సోషల్ మీడియా గెలిచింది! సోషల్ మీడియా అంటే కేవలం లైకులు, షేర్లు, కామెంట్లు మాత్రమే కాదు… అవసరమైన సమయంలో స్పందించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడితే అదే నిజమైన సామాజిక బాధ్యత అని నిన్న సింగరాయకొండలో నిరూపితమైంది. మురసు తుఫాన్ ప్రభావంతో సింగరాయకొండలో రైళ్లు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు, యువకులు, స్వచ్ఛంద సేవకులు వెంటనే స్పందించారు. ఎవరికి తోచిన విధంగా వారు ముందుకొచ్చి ప్రయాణికులకు సహాయం అందించారు. కొందరు అల్పాహారం, ఆహార పదార్థాలు అందిస్తే, మరికొందరు తమకు చేతనైన రీతిలో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా, ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా మానవత్వమే లక్ష్యంగా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. సోషల్ మీడియాను కొందరు సమయం వృథా చేసే వేదికగా భావిస్తారు. కానీ అదే సోషల్ మీడియా ఒక మంచి సమాచారం అందించి, ఎంతోమందిని సేవా కార్యక్రమాల వైపు నడిపించగలదని నిన్నటి ఘటన నిరూపించింది. అందుకే అంటున్నాను… నిన్న సింగరాయకొండలో సోషల్ మీడియా గెలిచింది. మానవత్వం గెలిచింది. సేవాభావం గెలిచింది! సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0