కొండేపికి అనేకమంది శాసనసభ్యులు ఉన్నారు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా..
సింగరాయకొండ: కొండేపి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనేకమంది శాసనసభ్యులతో పోరాటం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. ఎన్ని రకాల దాడులు, దౌర్జన్యాలు చేసినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా వాటిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వారి నామినేషన్ పత్రాలను చింపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల నిబంధనలను పాటించాల్సిన అధికారులే వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0