సొంత డబ్బులతో మంచినీటి కుళాయిలు వేపించిన జనసేన నాయకులు.

Mar 3, 2026 - 04:17
 0  24
1 / 1

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ బ్రాహ్మణ కాలనీ నందు మంచినీటి కుళాయి లు జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సొంత నిధులతో రెండు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో రోజులుగా బాలాజీనగర్ బ్రాహ్మణ కాలనీవాసులు మంచినీటి కుళాయిలను మరియు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కూటమి నాయకత్వంలో జనసేన పార్టీ దృష్టికి ఆ ప్రాంత ప్రజలు తీసుకురావడం జరిగినది. అయితే గ్రామపంచాయతీలో వీధిలైట్లు గాని కుళాయిలకు గాని ఎటువంటి సామాన్లు పంచాయతీలో లేవని అధికారులు తెలియజేయగా, పబ్లిక్ మంచినీటి కుళాయిలకు అయ్యే ఖర్చులు జనసేన పార్టీ ఇవ్వడం జరిగినది. వీధిలైట్ల సమస్యను కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టడం జరిగినది. త్వరలోనే వీధిలైట్లు కూడా బ్రాహ్మణ కాలనీ ప్రజలకు ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ దగ్గర ఉండి వారికి అవసరమైన విధంగా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగినది......

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0