శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థాన గ్రామ పసుపు కుంకుమ కార్యక్రమం..
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లోని కళ్యాణమండపం బజార్లో కొలువు తిరిగి ఉన్న శ్రీ చెట్టు మహాలషమ్మ దేవస్థానం నందు ఉగాది పర్వదిన సందర్భంగా కమిటీ సభ్యులు - భక్తులు పసుపు కుంకుమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా దాతల సహకారంతో ఇచ్చినటువంటి నూతన పల్లకిలో అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి అందరికీ పసుపు కుంకుమ పంచారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆ చెట్టు మహాలక్ష్మి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0