ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర @2047 కార్యక్రమంలో భాగంగా “జీరో పావర్టీ P4 MBK 10-20” కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, కొండేపి మండలం MPDO కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, సెక్రటరీలు, గ్రామ స్థాయి మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు మరియు గ్రామ ప్రజలు విస్తృతంగా హాజరయ్యారు. కార్యక్రమానికి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి ఏ. కళావతి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
“జీరో పావర్టీ P4” కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మార్గదర్శకులను గుర్తించి, వారికి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శకులు అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరబాబు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, తిప్పారెడ్డి, లక్ష్మీనారాయణ
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా పేదరిక నిర్మూలనకు ఈ కార్యక్రమం ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.