చెత్తను చెత్తబుట్ట లోనే వేయాలి- ఆరోగ్యానికి అదే తొలిమెట్టు.. కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా, ఒంగోలులో శనివారం నాడు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పారిశుద్ధ్య పనులపై అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. కాలువల్లో తాగి పడేసిన వాటర్ బాటిల్స్ ,కూల్ డ్రింక్ బాటిల్స్ వ్యర్ధాలను వేయవద్దని- వాటిని డస్ట్ బిన్నుల్లోనే వేయాలని స్థానికులకు సూచించారు. పరిశుభ్రత దైవం అని మన పెద్దలు చెబుతుంటారు , మన ఇల్లు, మన వీధి ,మన నగరం శుభ్రంగా ఉండాలంటే మనం చేసే అతి చిన్న మరియు ముఖ్యమైన పని చెత్తను కేవలం చెత్తబుట్టలోనే వేయడం వలన సాధ్యమవుతుందని అన్నారు. వీటివలన దోమలు,
ఈగలు అనేక రకాల అంటూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని ఈ సందర్భంగా స్థానికులకు తెలిపారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1