పూజ సామగ్రి దుకాణమును ప్రారంభించిన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సన్నె బోయిన శ్రీనివాసులు నాయుడు
దక్షిణ సింహాచల పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి పూజ సామగ్రి దుకాణం శనివారం ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నె బోయిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి పి.కృష్ణవేణి, ముఖ్య అర్చక ఉదయగిరి వెంకట శేషా లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.
ప్రాంగణంలో స్వామివారి మొక్కులు చెల్లించుకునే భక్తులకు టెంకాయ, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు వంటి పూజా సామాగ్రి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, రికార్డ్ అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, కొట్టే సుబ్బారత్నమ్మ, DKD ప్రసాదు గారు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0